Hyderabad, మే 26 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ లోకి మే నెల చివరి వారంలో కొన్ని ఇంట్రెస్టింగ్, బ్లాక్‌బస్టర్ సినిమాలు రాబోతున్నాయి. ఇవి ఈ నెల 25 నుంచి 31 మధ్య స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో నాని నటించిన హిట్ 3తోపాటు సూర్య రెట్రో, సల్మాన్ ఖాన్ సికందర్ మూవీస్ ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మే 25 నుంచి 31 మధ్య మూడు భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఈ మూడూ మూడు భాషలకు చెందిన సినిమాలు కావడం విశేషం. వీటిలో నాని నటించిన హిట్ 3 బ్లాక్‌బస్టర్ హిట్ కాగా.. రెట్రో, సికందర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా నటించిన మూవీ సికందర్. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా రిలీజైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినా.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆదివా...