భారతదేశం, డిసెంబర్ 22 -- భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ విజయం నమోదైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 845 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఈ ఏడాది ఇప్పటివరకు విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన 'ఛావా' (రూ. 807 కోట్లు) అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ఉండేది. అయితే, తాజాగా 'ధురంధర్' ఆ రికార్డును బద్దలు కొట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకుంది.

భారత దేశీయ మార్కెట్‌లో ఇప్పటివరకు దురంధర్ సినిమా రూ. 555.75 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అంతర్జాతీయంగా కూడా రణ్‌వీర్ మేనియా గట్టిగా కనిపిస్తోంది. సుమారు 20 మిలియన్ డాలర్ల ఓవర్సీస్ వసూళ్లతో దురంధర్ సినిమా ...