భారతదేశం, అక్టోబర్ 5 -- పంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ తాజాగా, అక్టోబర్ 5న తన అత్యధిక రికార్డు స్థాయిని చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ మధ్య పెట్టుబడిదారులు దూసుకురావడంతో బిట్‌కాయిన్ ధర 1,25,000 డాలర్ల మార్కును అధిగమించి చరిత్ర సృష్టించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా గుర్తింపు పొందిన బిట్‌కాయిన్ అక్టోబర్ 5న ఒక్కో కాయిన్​ ధర 1,25,689 డాలర్లుగా నమోదైంది. ఇది 2025 ఆగస్టులో నమోదైన 1,24,500 డాలర్ల రికార్డును దాటింది.

కాయిన్‌మార్కెట్‌క్యాప్ (Coinmarketcap) డేటా ప్రకారం.. బిట్‌కాయిన్ 24 గంటల్లో 2.04 శాతం పెరిగి, దాదాపు 1,25,700 డాలర్ల వద్దకు చేరింది. ఈ వార్త రాస్తున్న సమయంలో బిట్​కాయిన్​ ధర 1,24,710 డాలర్ల వద్ద ఉంది. దీని మార్కెట్ క్యాప్ 2.48 ట్రిలియన్ డాలర్లకు చేరింది.

ఆ...