Hyderabad, ఆగస్టు 22 -- చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా అతని తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. అందులో చిరు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం చూడొచ్చు. ఈ సందర్భంగా చరణ్ రాసిన క్యాప్షన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. చిరు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.

చిరంజీవి శుక్రవారం (ఆగస్టు 22) తన 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడు కేక్ కట్ చేసి తనకు తినిపిస్తున్న వీడియోను చరణ్ షేర్ చేశాడు. నువ్వే నా హీరో, నువ్వే నా గైడ్, నువ్వే నా ఇన్‌స్పిరేషన్ అంటూ చరణ్ రాసిన క్యాప్షన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

"నాన్నా.. ఇది కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు.. మీరు ఎంత అద్భుతమైన వ్యక్తి అని జరుపుకునే పండుగ. మీరు నా హీరో, నా మార్గదర్శి, నా స్ఫూర్తి. నేను సాధించిన ప్రతి విజయం, నేను క...