భారతదేశం, జనవరి 15 -- సనన్ ఇంట్లో పెళ్లి సందడి ముగిసింది. బాలీవుడ్, టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ కృతి సనన్ గారాల పట్టి, చెల్లెలు నుపుర్ సనన్ పెళ్లి జరిగింది. ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌‌, నుపుర్ సనన్ ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అయితే, నుపుర్ పెళ్లి వేడుకలన్నీ ముగిశాక ఇప్పుడు కృతి సనన్ ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతున్నారు. తన ప్రాణం లాంటి చెల్లెలు అత్తారింటికి వెళ్లడంతో, ఇల్లంతా వెలితిగా ఉందంటూ ఆమె పంచుకున్న మాటలు ప్రతి అక్కాచెల్లెళ్లనూ కదిలిస్తున్నాయి.

గురువారం (జనవరి 15) ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన మధుర స్మృతులను పంచుకుంటూ కృతి సనన్ ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. "నా మనసులోని మాటలను చెప్పడానికి పదాలు సరిపోవు.. నా చిన్న తల్లికి పెళ్లి అయిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అంటూ తన ఆవేదనను, ఆనందాన్ని వ్యక్తపరిచింది...