Hyderabad, జూన్ 3 -- కర్ణాటకలో తన థగ్ లైఫ్ సినిమాను రిలీజ్ చేయకుండా అడ్డుకోవడంపై కర్ణాటక హైకోర్టుకు వెళ్లిన కమల్ హాసన్ కు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. కన్నడ భాషపై అతడు చేసిన కామెంట్స్ ను కోర్టు కూడా తప్పుబట్టింది. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు అతనికి మొట్టికాయలు వేయడంతోపాటు క్షమాపణ చెప్పడానికి ఇబ్బందేంటని ప్రశ్నించింది.
కమల్ హాసన్ వేసిన పిటిషన్ పై మంగళవారం (జూన్ 3) కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా కోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో కమల్ తగిన చర్యలు తీసుకోవడానికి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమయం ఇచ్చింది. "విచక్షణ అనేది ముఖ్యమైనది. ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి మేము అంగీకరించం. తప్పులు జరుగుతాయి. కానీ ఆ తప్పులు జరిగినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి" అని కోర్టు వ్యాఖ్యానించింది.
కమల్ హాసన్ తరఫున రాజ్‌కమల్ ఫిల్మ్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.