భారతదేశం, డిసెంబర్ 23 -- బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్, 'సయ్యారా' హీరో అహాన్ పాండే నేడు తన 28వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తొలి సినిమాతోనే 'సూపర్ హిట్'ను తన ఖాతాలో వేసుకున్న ఈ కుర్ర హీరోపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, అహాన్ కి ఈ విజయం అకస్మాత్తుగా రాలేదని, ఆయన ఎప్పుడూ ఒక స్టార్ లానే ఉండేవాడని చెబుతున్నారు ఆయన కో-స్టార్ అనీత్ పద్దా.

అహాన్ వ్యక్తిత్వాన్ని వివరిస్తూ అనీత్ రాసిన లేఖ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. "స్క్రీన్‌పై ప్రపంచం నిన్ను 'సయ్యారా'గా చూడటానికి ముందే.. నీలోని స్టార్‌ని నేను చూశాను. నువ్వు గట్టిగా నవ్వినప్పుడు చుట్టుపక్కల అపరిచితులు కూడా తెలియకుండానే నవ్వుతారు. నీ నోట్‌పాడ్‌లోని అద్భుతమైన ఆలోచనలు, సామాన్య విషయాల్లో కూడా అందాన్ని వెతికే నీ తపన.. నిన్ను ఒక అరుదైన వ్యక్తిగా నిలబెట్టాయి" అని అనీత్ పేర్కొన్నారు.

సినిమా హిట్...