Hyderabad, అక్టోబర్ 6 -- ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన విద్యార్హతను ప్రశ్నిస్తూ తన తెలివితేటలను కించపరిచిన ఒక ట్రోల్‌కు గట్టిగా సమాధానం ఇచ్చింది. ఎక్స్ వేదికగా ఆమె చేసిన ఒక రాజకీయ పోస్ట్‌పై ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఆ ట్రోల్ ఆమె ChatGPTని ఉపయోగించి 'వ్యంగ్య ట్వీట్‌లు' చేస్తోందని కూడా ఆరోపించాడు. దీనికి ఆమె గట్టిగానే బదులిచ్చింది.

ఖుష్బూ సుందర్ ఇటీవల తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఎక్స్ లో ఒక రాజకీయ పోస్ట్ చేసింది. దానికి స్పందించిన ఒక వ్యక్తి ఇలా రాశాడు. "నిజంగానే వ్యంగ్య ట్వీట్‌లు చేయగలరా లేక దీనికి chatgptని ఉపయోగిస్తున్నారా.. లాఫింగ్ ఔట్ లౌడ్‌లీ (నవ్వుతున్న ఎమోజీ) మీ 8వ తరగతి చదువు మాకు తెలుసు" అని రిప్లై ఇచ్చాడు.

ఈ కామెంట్‌ను ఖుష్బూ తిరిగి ట్వీట్ చేస్తూ.. ప్రముఖ కార్యకర్త, రాజకీయ నాయకుడు కుమారస్వామి కామరాజ్ కూడా నాలుగో తరగత...