Hyderabad, సెప్టెంబర్ 12 -- తమన్నా భాటియా ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. గత 20 ఏళ్లుగా ఆమె చాలా భాషలలో సినిమాలు, ఇప్పుడు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఆమె నటించిన లేటెస్ట్ షో 'డూ యూ వానా పార్ట్‌నర్'లో ఆమె ఒక బ్రూవరీ స్టార్టప్‌ని మొదలుపెట్టి మగవాళ్ళ ప్రపంచంలోకి అడుగుపెట్టే ఒక మహిళ పాత్రలో నటించింది. ఈ సందర్భంగా హిందుస్థాన్ టైమ్స్‌తో ఒక ఇంటర్వ్యూలో తమన్నా ఈ షో గురించి చాలా విషయాలు మాట్లాడింది.

తమన్నా నటించిన ఈ డూ యూ వానా పార్ట్‌నర్ వెబ్ సిరీస్.. సాధారణంగా మగవాళ్ళు డామినేట్ చేసే ఆల్కహాలిక్ డ్రింక్స్ పరిశ్రమలోకి మహిళలు అడుగుపెట్టే కథను చూపిస్తుంది. ఈ షో రియల్ లైఫ్‌ని ఎలా చూపిస్తుందో తమన్నా చెప్పుకొచ్చింది. "సమాజంలో చాలా మంది మహిళలను చూడడానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళు చెప్పేది వినడానికి ఇష్టపడరు. మహిళలు అలాగే ఉంటే ఇష్టపడతారు కానీ ఒక మంచి ఆలోచన చె...