భారతదేశం, డిసెంబర్ 3 -- తెలంగాణలో పంచాయతీ ఫైట్ ఆసక్తిగా మారుతోంది. రోజురోజుకు లోకల్‌గా ఎత్తుగడలు వేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. వాడవాడకు మీటింగ్స్ పెడుతున్నారు. కమ్యునిటీలవారిగా చర్చలు జరుపుతున్నారు. ఊర్లలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు కూడా నామినేషన్లు వేయడంతో మరింత ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇంట్లోని ఏ వ్యక్తి గెలుస్తారా? అని చాలా ఊర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఘన్‌శ్యామ్‌దాస్ (జీడీ) నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అత్తాకోడళ్లు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆ స్థానాన్ని మహిళకు రిజర్వ్ చేశారు. మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య ఆదివారం తన తల్లి సూర నర్సమ్మ తరపున నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఆయన అన్న భార్య అంటే వదిన సూర రమాదేవి కూడా నామినేషన్ పత్రాలను సమర్పించ...