Hyderabad, మే 22 -- కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యారాయ్ బచ్చన్ సందడి చేశారు. ఆమె వయసు పెరిగినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా ఉన్నారు. ఐశ్వర్యరాయ్ లుక్ ఈసారి చాలా రాయల్ గా ఉంది. ఆమె భారతీయతను ప్రపంచానికి చాటేలా ముస్తాబైంది.

చీర కట్టు నుంచి నుదుటిన సింధూరం వరకు ఆమె భారతీయతను ప్రదర్శించింది. ఆమె మెడలో ధరించిన రూబీ నెక్లెస్ అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఏదేమైనా, మిసెస్ బచ్చన్ తన రాయల్ లుక్ తో అందంగా మెరిసింది.

ఐశ్యర్యా రాయ్

ఆమె వేసుకున్న లేయర్డ్ నెక్ పీస్ రూబీ స్టోన్, అన్ కట్ డైమండ్ తో తయారు చేసినవి. ఈ నెక్ పీస్ ఎంతో ప్రత్యేకమైనదని చూస్తేనే అర్థమైపోతోంది. ఐశ్వర్యారాయ్ నెక్ పీస్ ను మనీష్ మల్హోత్రా రూపొందించారు. రూబీ రాళ్లతో చేసిన ఇలాంటి ఆభరణాలకు మనీష్ మల్హోత్రా పెట్టింది పేరు. ఐశ్వర్య వేసుకున్న ఈ నెక్లెస...