Hyderabad, ఆగస్టు 31 -- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ నోట్ షేర్ చేశారు. గౌతమ్ చిన్నప్పుడు తీసిన ఓ త్రో బ్యాక్ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ తన బర్త్ డేను మిస్ అవ్వడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ సందర్ంగా గౌతమ్ ఘట్టమనేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మహేశ్ బాబు.

"హ్యాపీ 19 మై సన్. ప్రతి సంవత్సరం నువ్ నన్ను కొంచెం ఆశ్చర్యపరుస్తావ్. కానీ, ఈ ఏడాది నీ బర్త్‌డేను మిస్ అవుతున్నాను. ఇదే తొలిసారి నేను ఇలా మిస్ అవడం. నువ్ వేసే ప్రతి అడుగులో నా ప్రేమ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు మద్దతుగా నా ప్రేమ ఉంటుంది. ఇలాగే వెలుగొందుంతూ నువ్ పెరగాలని కోరుకుంటున్నా" అని మహేశ్ బాబు స్వీట్ నోట్ రాసుకొచ్చారు.

ఈ ట్వీట్‌లో ఎన్నో లవ్, కిస్, హగ్ ఎమోజీస్ ఉన్నాయి. ఆ అక్షరాలు, ఎమోజీస్‌ను బట్టి క...