భారతదేశం, జనవరి 10 -- ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని... రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో తాజా పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

"గతంలో విద్యుత్ భారం అంతా ప్రజల నెత్తిన ట్రూ ఆప్ ఛార్జీల పేరిట వేశారు. మేం ట్రూ డౌన్ అని కరెంటు బిల్లుల భారం తగ్గించాం. రూ.4500 కోట్లు పెంచుకోమని ఈఆర్సీ అనుమతి ఇస్తే ప్రజలపై భారం వద్దని.. ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోమారు స్పష్టం చేస్తున్నా. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు పేరిట సుపరిపాలన అందించేలా కార్యాచరణ రూపోందించాం. వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌరసేవలన్నీ సులభతరం చేశ...