భారతదేశం, జనవరి 7 -- పోలవరం నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని... గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్అండ్ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పారు. పునరావాసం, ఆర్అండ్ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయాలన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు చేయాలన్నారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్ట...