Hyderabad, ఏప్రిల్ 12 -- వెంట్రుకలు రాలిపోతుండటం, చిన్న వయస్సులోనే బట్టతల రావడం ఈ రోజుల్లో చాలామందిలో కనిపిస్తున్న సమస్య. మీరనుకుంటున్నట్లు దీనికి కారణం కేవలం మీరు వాడే షాంపూ లేదా హెయిర్ ఆయిల్ మాత్రమే అనుకోవద్దు. మీరు తీసుకునే ఆహారం కూడా ఓ రకంగా జుట్టుపై ప్రభావం చూపిస్తుందట. శరీరానికి సరిపడ హైడ్రేషన్ లేకపోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లు కూడా కనిపిస్తుంది. ఫలితంగా తలలోని వెంట్రుకలు బలహీనపడిపోతాయి. దీనికి కారణంగా సులభంగా తెగిపోవడం, కొన్నిసార్లు రాలిపోవడం కూడా జరుగుతుంది.

ఈ సమస్యను సునాయాసంగా పరిష్కరించుకోవాలంటే మీకు కావాల్సింది కేవలం నీరు మాత్రమే. శరీరానికి హైడ్రేషన్ అందించి జుట్టు రాలిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు పెరుగుదలతో పాటు వెంట్రుకలకు బలం కూడా అందుతుంది. సరైన మోతాదులో నీరు తాగితే జుట్టులో తేమ మెరుగై బలపడుతు...