భారతదేశం, జూన్ 17 -- వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ యూజీ 2025 ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. నీట్ యూజీ 2025 ఫలితాల తరువాత ప్రక్రియ అయిన కౌన్సెలింగ్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఎంసీసీ ఈ కింది సీట్లకు సంబంధించి నీట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. అవి..

సీట్ల కేటాయింపు వరకు ఎంసీసీ నీట్ యూజీ కౌన్సెలింగ్ ఆన్లైన్ ప్రక్రియగా ఉంటుందని, ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు తమకు కేటాయించిన మెడికల్ కాలేజీల్లో రిపోర్టు చేసి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా, ఆ తర్వాత స్ట్రే వేకెన్సీ (stray vacancy) రౌండ్, ప్రత్యేక స్ట్రే వేకెన్సీ (special str...