భారతదేశం, మే 2 -- వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీకి సంబంధించి అసత్యాలు ప్రచారం అవుతున్నాయి. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్ మీడియా ఛానళ్లపై ఎన్టీఏ చర్యలు చేపట్టింది. నీట్ యూజీ పరీక్ష మే 4న జరగనుంది. 550 నగరాల్లో 5 వేలకు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొంతమంది పేపర్ లీకేజీకి సంబంధించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారు. ఇలాంటి 120పైగా ఖాతాలను ఎన్టీఏ గుర్తించింది. ఈ మేరకు కేసులు కూడా నమోదు అయ్యాయి.

కొత్తగా ప్రారంభించిన అనుమానాస్పద క్లెయిమ్స్ రిపోర్టింగ్ పోర్టల్(https://neetclaim.centralindia.cloudapp.azure.com/) ద్వారా తమకు సమాచారం అందిందని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. పరీక్షకు సంబంధించిన నకిలీ స్టేట్‌మెంట్స్ ఫార్వర్డ్ చేస్తున్న 106 టెలిగ్రామ్ ఛానళ్లు, 16 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఎన్టీఏ గుర్తించింది...