భారతదేశం, జనవరి 5 -- గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడారు. దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మాతృభాష మన మూలాలకు సంకేతం అని, ఆంగ్లం అవసరమే కానీ.. మాతృ భాషను మరిచిపోతే మనల్ని మనం కోల్పోయినట్టేనని అన్నారు.

'మాతృభాష అమ్మతో సమానం. మాతృ భాషలో చదువుకున్న వారు ప్రపంచంలో ఏమైనా చేయగలరు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్‌కు అభినందనలు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన అమ్మభాష పండుగ ఇది. తెలుగు వారి ఆత్మగౌరవం చాటిన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేరు ఈ వేదికకు పెట్టడం మంచి విషయం. దేశంలో అనేక భాషలు ఉన్నా ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉంది. ఇలాంటి సభలు తెలుగు భాష గొప్పతనం చాటేందుకు ఉపయోగపడతాయి.' అని చంద్రబాబు అన్నారు.

తెలుగ...