భారతదేశం, నవంబర్ 1 -- బిగ్ బాస్ 9 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌ ఎనిమిదో వారం పూర్తి చేసుకోనుంది. అయితే, ప్రతి వారం కంటెస్టెంట్ల ఆట తీరుపై హోస్ట్ నాగార్జున వచ్చి రివ్యూలు ఇస్తాడని తెలిసిందే. అలాగే, ఈ శనివారం (నవంబర్ 1) నాటి ఎపిసోడ్‌లో కూడా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు.

ముందుగా ఎలిమినేట్ అయి రీ ఎంట్రీ ఇచ్చి పర్మనెంట్ కంటెస్టెంట్‌గా మారిన భరణి శంకర్‌ను లేపారు నాగార్జున. "భరణి ముందు ఒక విషయం చెప్పు. సేఫ్ ఆడి ఆడి.. హౌజ్‌లో నుంచి వెళ్లిపోయావ్. మళ్లీ సేఫ్ ఆడతావా.. ఆడుదామనుకుంటున్నావా" అని నాగార్జున అడిగాడు.

"ఇప్పుడు ఈ వీక్ సేఫ్ ఆడాను అంటున్నారా సర్" అని భరణి అన్నాడు. "200 పర్సంట్" అని నాగార్జున అన్నాడు. "కెప్టెన్సీ టాస్క్‌లో భరణి స్టాండ్ తీసుకున్నాడా, సేఫ్ ఆడాడా" అని సుమన్ శెట్టిని నాగార్జున ప్రశ్నించాడు. "నాకు అ...