Hyderabad, జూన్ 24 -- నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల విడాకులు తీసుకున్న విషయం తెలుసు కదా. ఆమె 2023లో వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో మూడు సంవత్సరాల వివాహబంధానికి ముగింపు పలికింది. తాజాగా, హిట్ టీవీ స్పెషల్స్‌తో ఒక ఇంటర్వ్యూలో నాగబాబు తన కుమార్తె విడాకుల గురించి మాట్లాడాడు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటుందా లేదా అన్న విషయాలనూ వెల్లడించారు.

తన పిల్లలు వరుణ్ తేజ్, నిహారిక వృత్తిపరమైన నిర్ణయాలలో తాను జోక్యం చేసుకోనని, పరిశ్రమలో వారికి సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడానికి అనుమతిస్తానని నాగబాబు తెలిపాడు. ప్రతి తల్లిదండ్రులు తమ అంచనాలతో పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారి ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలని సలహా ఇచ్చాడు.

"నా పిల్లల సినిమాలు హిట్టయినా, ఫ్లాపయినా నాకు పట్టింపు లేదు. వారి సంతోషమే నాకు ముఖ్యం. వారు సంతోషంగా లేకపోతే కోట్లు ఉన్నా ప్ర...