భారతదేశం, నవంబర్ 22 -- శ్రీ సత్యసాయిబాబా లక్షలాది మందిని సేవా మార్గాన్ని అనుసరించేలా ప్రేరేపించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.

'మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ' అనే నమ్మకాన్ని సత్యసాయి బాబా ప్రచారం చేశారని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఆయన ఆధ్యాత్మికతను నిస్వార్థ సేవతోను, వ్యక్తిగత పరివర్తనతోను ముడిపెట్టారని అభిప్రాయపడ్డారు. సాయిబాబా లక్షలాది మంది సేవా మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించారని చెప్పారు.

ఆధ్యాత్మికతను ప్రజా సంక్షేమంతో అనుసంధానించాలని సత్యసాయిబాబా తన అనుచరులకు విజ్ఞప్తి చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. అనేక దేశాల్లోనూ ఆయన భక్తులు అణగారిన వర్గాలకు సేవ చేయడం ఒక సంతృప్తి ని కలిగించే విషయమని ఆమె అన్నారు. నిస్వార్థ సేవ...