భారతదేశం, జనవరి 29 -- సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్దనూర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయ నిర్మాణానికి మంత్రి, కార్మిక మంత్రి జి.వివేక్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిషేధిత భూములకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికి రెండు నెలల్లో కొత్త అప్లికేషన్‌ను(యాప్) ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతిపాదిత భూధార్ కార్డు భూమికి సంబంధించిన అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఉపయోగపడుతుందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇది భూమి యాజమాన్యం, రికార్డులలో పారదర్శకత, స్పష్టతను నిర్ధారిస్తుందన్నారు. భవిష్యత్తులో వివాదాలను నివారిస్తుందని స్...