భారతదేశం, జనవరి 4 -- బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ 'లవ్ అండ్ వార్' (Love & War) గురించి గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందనే వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి.

అయితే, ఈ పుకార్లపై చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన సన్నిహిత వర్గాలు తాజాగా స్పష్టతనిచ్చాయి. "సినిమా యూనిట్ ప్రస్తుతం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఇయర్-ఎండ్ బ్రేక్‌లో ఉంది. భన్సాలీ సినిమాలు చాలా భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి, చిన్న విరామం వచ్చినా అది వాయిదా పడినట్లుగా కనిపిస్తుంది" అని చిత్ర బృందానికి చెందిన ఒక ప్రతినిధి పేర్కొన్నారు.

లవ్ అండ్ వార్ పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ ...