Hyderabad, అక్టోబర్ 3 -- ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఓజీని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించారు. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మాతగా వ్యవహరించిన ఓజీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓజీ విజయోత్సవ వేడుకను నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగిన ఓజీ సక్సెస్ ఈవెంట్‌లో దర్శకుడు సుజిత్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

ఓజీ డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక కథ కూడా రాసుకోలేదు ఆయన కోసం. కానీ ప్రకృతి ఎంత బలమైంది అంటే నన్ను తీసుకువచ్చి పవన్ గారితో సినిమా చేసేలాగా చేసింది" అని అన్నారు.

"త్రివిక్రమ్ గారి వల్ల ఈ అవకాశం రావ...