భారతదేశం, జనవరి 1 -- సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ హీరోలుగా, నటులు దర్శకులుగా, హీరోయిన్స్ సింగర్స్‌గా మారి అందరిని ఆశ్చర్యపరచడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే ఓ నిర్మాత నటుడిగా మారి గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించిన ఆయన నటుడిగానూ మెప్పిస్తున్నారు.

ఆయనే ప్రొడ్యూసర్ యశ్ రంగినేని. టాలీవుడ్‌లో ఓ నిర్మాతగా యశ్ రంగినేని మంచి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో 'పెళ్లి చూపులు' చిత్రాన్ని నిర్మించారు.

ఆ తరువాత యశ్ రంగినేని నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన 'పెళ్లి చూపులు' చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.

ఇక నిర్మాతగా తన అభిరుచ...