భారతదేశం, ఏప్రిల్ 20 -- నిర్మల్‌‌ ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక కమాండో గ్రూప్‌‌ను ఏర్పాటు చేశారు. దీనికి టీమ్ శివంగి అని పేరు పెట్టారు. ఎన్‌‌ఎస్‌‌జీ, ఎస్‌‌పీజీతో పాటు గ్రేహౌండ్స్‌‌కు దీటుగా ఈ టీమ్‌‌కు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ గ్రూప్‌‌ కార్యకలాపాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. టీమ్ శివంగికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.నిర్మల్ జిల్లాలోని అన్ని పోలీస్‌‌ స్టేషన్లలో పనిచేస్తున్న చురుకైన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను టీమ్ శివంగి కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు.

2.ఎంపిక చేసిన వీరికి పురుష కమాండోలతో సమానంగా 45 రోజుల పాటు ట్రైనింగ్‌‌ ఇచ్చారు. శిక్షణ సందర్భంగా ఆయా విభాగాల్లో నైపుణ్యం కనబరిచిన వారికి ఆ విభాగాల కమాండింగ్‌‌ బాధ్యతలను ...