భారతదేశం, నవంబర్ 13 -- ఆర్టీసీ లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు అనుగుణంగా బస్సు రూట్ లు పెంచేలా స్టడీ చేయాలన్నారు. గురువారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన. పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపో లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ఆదేశించారు. లాభాల్లోకి వచ్చేలా ఆయా డిపోలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అరంఘార్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ , పోలీస్ శాఖల భూ బదలాయింపు పై చర్చించాలన్నారు. నగరంలో కొత్త బస్సు డిపో లకు స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ తో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు.

బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మాని...