భారతదేశం, ఏప్రిల్ 28 -- తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉండొచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు.

పోలీస్ శాఖలో వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు. కానీ 2007లో హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిగాక... పోలీస్ శాఖను బలోపేతం చేయాలని సంకల్పించారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే.. ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యంకాదని.. అందుకే పలు దఫాలుగా నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, ప్రభుత్వాలు మారడం వంటి కారణాలతో భర్...