భారతదేశం, ఏప్రిల్ 22 -- నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా, ఏపీపీఎస్సీ పెండింగ్ నోటి ఫికేషన్లపై కసరత్తు మొదలుపెట్టింది. జనవరిలోనే ఉద్యోగాల భర్తీపై ప్రకటన రావాల్సి ఉండగా, ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. వివిధ శాఖల్లో సుమారు 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అటవీ శాఖలో 814 పోస్టులున్నాయి. ఎస్సీ వర్గీకరణకు రోస్టర్ పాయింట్లు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ విషయంపై స్పష్టత రాగానే ఏపీపీఎస్సీ నోటి ఫికేషన్ల జారీ చేయనుంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్షలు మే 3 నుంచి ప్రారంభం కానున్నాయి. మరో...