Hyderabad, జూలై 19 -- తమిళ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ (DNA). తెలుగులో మై బేబీ పేరుతో శుక్రవారం (జులై 18) థియేటర్లలో రిలీజైంది. అయితే శనివారం (జులై 19) నుంచే జియోహాట్‌స్టార్ లో తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది? ఐఎండీబీలో 7.9 రేటింగ్ సాధించేంతలా ఈ సినిమాలో ప్రేక్షకులకు నచ్చిన విషయం ఏంటన్నది ఈ రివ్యూలో చూడండి.

తమిళ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ. ఈ సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజైంది. అథర్వ, నిమిషా సజయన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ పసి బిడ్డల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది. ముందుగా కథ 2014లో జరిగే ఓ యాక్సిడెంట్ తో మొదలవుతుంది. వరదరాజన్ (జీషాన్ అయ్యుబ్) అనే ఓ సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్ నిద్ర మత్తులో కారు నడుపుతూ ఓ బైకును వెనుక నుంచి ఢీకొడతాడు. ఇందులో భార్యాభర్తలు ఇద్దరూ కన్నుమూయగా.. వాళ్ల రోజు...