భారతదేశం, మే 12 -- ఏపీలో ఎండతీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7degC గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 41degCకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైంది.

ఏపీలో అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 42డిగ్రీల నుంచి 43.5deg డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది.

రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరంలో 2, పార్వతీపురంమన్యంలో 11, కాకినాడలో 3, తూర్పుగోదావరిలో 1 మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మరో 32 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. బుధవారం 22 మండలాల్లో తీ...