భారతదేశం, సెప్టెంబర్ 8 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో రఘురాం దగ్గరకు వచ్చి పూజ బాగా జరిగిందని చంద్రకళ చెప్తుంది. అత్తయ్య సపోర్ట్ చేసి పూజలో కూర్చునేలా చేసింది. మీరు త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నార అని మెడిసిన్ తాగిపిస్తుంది చంద్ర. మీరు త్వరగా లేచి నా తప్పు లేదని చెప్తే చాలు అని చంద్ర వెళ్లిపోతుండగా.. రఘురాం చేయి ఎత్తి పిలుస్తాడు. అమ్మా అని అంటాడు. చంద్ర అందరినీ పిలిచేందుకు వెళ్తుంది.

అప్పుడే రఘురాం కాళ్లను కదిలించడం శాలిని చూస్తుంది. మెట్ల పై నుంచి చంద్రకళ పడిపోతుంటే విరాట్ పట్టుకుంటాడు. శాలినిని ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నువ్వు చేసినవన్నీ నాకు తెలుసు. నువ్వు చేసిన దానికి చంద్రకళకు శిక్షకు పడింది. అందుకే నీ గురించి అందరికీ చెప్పేస్తాను. చంద్ర తప్పు ఏం లేదని ఇప్పుడే చెప్పేస్తాను అని రఘురాం మంచంపై లేవడానిక...