Hyderabad, సెప్టెంబర్ 6 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వినాయక పూజలో అందరూ ఏదో ఒక వస్తువు పెడతారు. శ్రుతి మాత్రం ఖాళీ పేపర్ పెడుతుంది. దాంతో అంతా నవ్వుతారు. రఘురాంకు రాసే ఆయిల్‌ను జగదీశ్వరి తెచ్చి పెట్టి భర్త ఆరోగ్యమే ముఖ్యం కదా అంటుంది. మీ కోరిక నెరవేరుతుందని, చంద్రకళ హస్తవాసి మంచిదని, దేవుడు కష్టాలు ఇస్తాడు. అవి తట్టుకున్నవారిని కరుణిస్తాడు అని అర్జున్ చెబుతాడు.

దాంతో జగదీశ్వరి సంతోషంగా ఫీల్ అవుతుంది. పంతులు పూజ చేస్తాడు. కోరికలు కోరుకోమంటాడు. ఎవరికి కావాల్సింది వారు కోరుకుంటారు. పంతులు వెళ్లిపోతాడు. బొట్టు తీసుకొచ్చి రఘురాంకు పెడుతుంది చంద్రకళ. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. పిలవగానే వచ్చావ్. కొంచెంకూడా మొహమాటం లేదా అని అర్జున్‌ను శ్యామల అడుగుతుంది.

కొంచెం కాదు అస్సలు లేదు. అసలు చంద్రకళ నన్ను పిలవలేదు. నేనే అడిగి మరి వ...