Hyderabad, సెప్టెంబర్ 5 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కొద్దిరోజుల్లో నువ్వే ఇంట్లోంచి వెళ్లిపోతున్నావ్. ఇప్పుడు అతిథి సత్కారాలు అవసరమా అని గట్టిగా మాట్లాడుతుంది శ్యామల. అది అర్జున్, విరాట్ వింటూ ఉంటారు. వెంటనే వెళ్లి అత్తయ్య మన ఇంట్లో గొడవలు బయటివాళ్లకు తెలియకుంటే మంచిది. అతని ముందు కాస్తా నార్మల్‌గా ప్రవర్తించండి అని విరాట్ అంటాడు.

దాంతో పెళ్లానికి వత్తాసు పలకడానికి రెడీగా ఉంటావని వెళ్లిపోతుంది శ్యామల. చంద్ర మేము పైకి వెళ్లి మాట్లాడుకుంటాం. కాఫీ అక్కడికే తీసుకురా అని విరాట్ చెప్పి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న తల్లీకూతురు పైన మెట్లపై పడేలా వైర్ కడతారు. చంద్రకళ పైకి వస్తుంది. తనకు ఎదురుగా విరాట్, అర్జున్ వస్తారు. వైర్‌ను చూసిన అర్జున్ చంద్రకళను ఆగమంటాడు.

వైర్ తీస్తాడు అర్జున్. అయినా ఇలా దారిలో పెట్టుంటారు అని అర్జున్ అడుగుతాడు. ...