భారతదేశం, సెప్టెంబర్ 4 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 4వ తేదీ ఎపిసోడ్ లో పూజకు కావాల్సిన సామగ్రిని తెమ్మని శాలిని వాళ్లను పంపించింది నేనేనని శ్యామల అంటుంది. పూజ చేయాల్సింది వాళ్లే కాబట్టి. పూజ చేయడానికి నువ్వు అర్హురాలు కాదు అని శ్యామల చెప్తుంది. ఈ ఇంట్లో ఉన్నంత వరకూ ఈ ఇంటి కోడలిగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పాను. పదే పదే అడ్డుకోవడం బాలేదని చంద్రకళ అంటుంది.

పండగ పూట గొడవలెందుకు అత్తయ్య? వరలక్ష్మి వ్రతానికి పర్మిషన్ ఇచ్చావు కదా. ఇప్పుడు ప్రాబ్లెం ఏముంది? అని విరాట్ అడుగుతాడు. మా అన్నయ్య కోలుకోవడానికి ఈ పూజ. చంద్రకళ పూజలో కూర్చోవడానికి ఒప్పుకోనని శ్యామల అంటుంది. మామయ్యకు చెడు జరగాలని కోరుకుంటానన్నదే మీ భయం అయితే నేను పూజలో కూర్చోను పిన్ని అని చంద్రకళ చెప్పేస్తుంది.

చంద్రకళ కొబ్బరికాయ పీచు తీస్తూ చేతికి గాయం చేసుకుంటుంది. ...