Hyderabad, సెప్టెంబర్ 27 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పికిల్స్ బిజినెస్ నష్టపోయేలా చేసిన శ్రీధర్‌ను అర్జున్ కొడతాడు. దాంతో శ్రీధర్ నిజం చెబుతాడు. ఇదంతా చేసింది చంద్రకళ తోటి కోడలు శాలిని. చంద్ర అంటే శాలినికి కోపం. అంతకుమించి నాకు తెలియదు అని శ్రీధర్ చెబుతాడు. అంటే, చంద్రకళను శాలిని మోసం చేస్తుందా అని అర్జున్ అనుకుంటాడు.

మళ్లీ శ్రీధర్‌ను రూమ్‌లో బంధించి లాక్ పెడతాడు అర్జున్. ఇప్పుడు ఈయన చంద్రకళ ఇంటికి వెళ్లి శాలిని గురించి చెబుతారా. తర్వాత వచ్చి నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అరెస్ట్ చేయిస్తారా. ఇలా ఇరికించారేంటీ. ఈ విషయం శాలిని మేడమ్‌కు చెప్పాలి. ఆవిడే కాపాడతారు అని శ్రీధర్ కాల్ చేస్తాడు. మీరు నన్ను పోలీస్ట్ స్టేషన్ నుంచి తీసుకురావాలి. వెళ్లేలా ఉన్నాను. పచ్చళ్లు పాడవ్వడానికి కారణం నేను అని కనిపెట్టారు. పిచ్చకొట్టుడు కొట్టార...