Hyderabad, సెప్టెంబర్ 22 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో క్రాంతితో రోజ్ ఫ్లవర్ తలలో పెట్టించుకున్న శాలిని అయ్యో.. అత్తయ్య ఇక్కడే ఉన్నారు. పో క్రాంతి అని వెళ్లిపోతుంది. మరిది గారు మీ రొమాన్స్‌ను హాల్లో కాకుండా రూమ్‌లో పెట్టుకోండి అని చంద్రకళ అంటుంది. క్రాంతి సిగ్గుపడుతూ వెళ్లిపోతాడు.

జగదీశ్వరి వెళ్లిపోతుంటే క్రాంతి, శాలిని అన్యూన్యంగా ఉంటున్నారు. అది మీరు శాలినిని క్షమించి ఒక్క అవకాశం ఇవ్వడం వల్లే. నన్ను కూడా క్షమించి అవకాశం ఇస్తే ఈ ఇల్లు మరింత ఆనందంగా మారుతుంది. క్షమిస్తారా అని అడుగుతుంది చంద్రకళ. జగదీశ్వరి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. చంద్రకళకు అర్జున్ కాల్ చేసి పచ్చళ్లని పాడైపోయాయని, స్టాక్ వెనక్కి వచ్చాయని చెబుతాడు.

రీటేలియర్స్ అందరా క్వశ్చన్ చేయడానికి వస్తున్నారు. చాలా టెన్షన్‌గా ఉంది. మీరు కూడా వస్తారా అని అర్జున్ అడిగితే...