Hyderabad, సెప్టెంబర్ 20 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నేను సర్‌ప్రైజ్ చేద్దామని అద్దం మీద రాస్తే చూడలేదు, అందరిని ఒప్పించి కేక్ కటింగ్ చేపిద్దామని చూస్తే ఆఫీస్‌లో చేసుకున్నావ్ అని విరాట్ అలుగుతాడు. అక్కడ సెలబ్రేషనే ఉంది, హ్యాపీనెస్ లేదు. మీతో విష్ చేయించుకోలేదని మనసులో ఉంది అని దబాయిస్తుంది చంద్రకళ.

ఏంటే నేను ఫీల్ అయ్యానని కూడా లేకుండా నన్నే అంటున్నావ్ అని విరాట్ అంటాడు. ఇప్పుడు నా బర్త్ డే సెలబ్రేట్ చేస్తారా లేదా అని చంద్ర అంటే చేయను అని విరాట్ అంటాడు. దాంతో కోపంతో చక్కిలిగింతలు పెడుతుంది చంద్రకళ. దానికి నవ్వుతాడు విరాట్. వెంటనే విరాట్‌ను హగ్ చేసుకుంటుంది చంద్రకళ. సోషల్ మీడియాలో ఫొటోల గురించి మాట్లాడుకుంటారు.

తర్వాత ఎవరికి తెలియకుండా కేక్ తీసుకొచ్చి చంద్రకళతో కట్ చేయిస్తాడు విరాట్. సంతోషంగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది చం...