భారతదేశం, సెప్టెంబర్ 2 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో మల్లె పూలు ఏం చేయాలా? అని ఆలోచిస్తాడు విరాట్. సీక్రెట్ గా చంద్ర గదిలో పెట్టాలనుకుంటాడు. కానీ అప్పుడే వచ్చిన చంద్రకళ బావ నా కోసం పువ్వులు తెచ్చావా? అని అడిగితే గట్టిగా అరవకు అని అంటాడు విరాట్. నీ కోసం కొనలేదు. ఓ ముసలావిడ మీద జాలితో కొనమంటే తీసుకున్నా. పెట్టుకుంటే పెట్టుకో అని విరాట్ అంటాడు. నీ చేతులతో తలలో పెట్టవా? అని చంద్రకళ క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఇంకా నువ్వు నా పెళ్లాం స్థానంలోకి రాలేదని చెప్పి విరాట్ వెళ్లిపోతాడు.

అప్పుడే శ్యామల వస్తుంది. మీ అల్లుడు నా కోసం పువ్వులు తెచ్చాడని చంద్రకళ చెప్తుంది. నేను అంతా విన్నా అని శ్యామల అంటుంది. నా భర్యను పూలు పెట్టమని కాదు నా కోసం పూలు కొనుక్కురమ్మని చెప్పే హక్కు కూడా ఉందని చంద్ర అంటుంది. ఇంకోసారి పూలు పె...