భారతదేశం, సెప్టెంబర్ 18 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ లో నీ ఆలోచన ఏదైనా సరే చంద్రకు పుట్టిన రోజు వేడుకలు ఈ ఇంట్లో జరగడం లేదని శ్యామల అంటుంది. గిఫ్ట్ ఇవ్వడం కాదు, అసలు విషెస్ చెప్పినా నేను చచ్చినంత ఓట్టే అని శ్యామల అనడంతో బాధ పడుతూ విరాట్ వెళ్లిపోతాడు. మరోవైపు బావ విష్ చేయకుండా డిసప్పాయింట్ చేశాడని బాధ పడుతూ చంద్ర ఆఫీస్ లోపలికి వెళ్తుంది.

ఆఫీస్ మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది. హ్యాపీ బర్త్ డే అంటూ అర్జున్, స్టాఫ్ అందరూ సర్ ప్రైజ్ చేస్తారు. అగ్రిమెంట్ అప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు షేర్ చేశారు కదా అందులో బర్త్ డే డేట్ చూశానని అర్జున్ అంటాడు. చంద్రకళ కేక్ కట్ చేస్తుంది. ఈ ఫొటోలు శాలిని మనిషి తీసి శాలినికి పంపించాలని అనుకుంటాడు. సంతోషంలోనైనా, బాధలోనైనా తోడుగా ఉండేది కుటుంబం మాత్రమే అని చంద్ర చెప్తుంది.

ఆ ఫొటోలు శాలి...