Hyderabad, సెప్టెంబర్ 12 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలినికి చంద్రకళ థ్యాంక్స్ చెబుతుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. శాలిని అర్థం చేసుకున్నట్లే అత్తయ్య వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు అని క్రాంతి అంటాడు. మనిద్దరం కలిసి ఉన్నంతవరకు ఇంట్లో ఏ సమస్య వచ్చిన ఎదుర్కోవచ్చు అని శాలిని అంటుంది. ఆ మాటలు విన్న శ్రుతి కామాక్షి దగ్గరికి వెళ్లి చెబుతుంది.

శాలిని చాలా మారిపోయింది. చంద్రకళ, శాలిని కలిసిపోయారు. చంద్రతో శాలిని చేతులు కలిపి మనల్ని పక్కన పెట్టింది. తన గురించి మనకు తెలుసన్న భయం లేకుండా మనల్ని పక్కన పెట్టడం ఏంటీ అని శ్రుతి అంటుంది. ఆ మాటలు విన్న శాలిని ఏంటీ ఓపెన్‌గా మాట్లాడుతున్నారు అని అంటుంది. నీకే భయం లేనప్పుడు మాకెందుకు అని శ్రుతి అంటుంది.

నువ్ చంద్రతో మాట్లాడింది చూసి కోపంతో అలా అంటుందని కామాక్షి అంటుంది. నా లె...