Hyderabad, సెప్టెంబర్ 11 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నాకు ఇంట్లో ఉండే అర్హత లేదా అని చంద్రకళ అడిగితే.. జగదీశ్వరి, విరాట్ సైలెంట్‌గా ఉంటారు. ఇది అన్నయ్యకు సంబంధించిన విషయం కాబట్టే నిర్ణయం నేనే తీసుకుంటాను. నువ్వు ఇంట్లో ఉండకూడదు అని శ్యామల అంటుంది. 30 రోజుల గడువు ఇచ్చారుగా. మధ్యలో వెళ్లమంటే మాట తప్పినట్లేగా అని శాలిని అంటుంది.

ఏదైనా తప్పు జరిగితే ఊరుకోను అని కూడా చెప్పాను అని శ్యామల అంటుంది. చంద్రకళను అందరూ నిందిస్తుంటే.. అత్తయ్య సంతోషించే విషయం అయితే వెంటనే చెప్పాలనుకుంటారుగా అని అందరితో అవును అని అనిపించిన శాలిని మరి చంద్రకళ చేసినదాంట్లో తప్పేముంది అని లాజిక్‌తో మాట్లాడుతుంది శాలిని. ఇప్పుడు సమాధానం చెప్పండి అని క్రాంతి అంటాడు.

మావయ్యకు అలా జరిగిందని బాధతో అంటున్నారు కానీ, చంద్ర చేసింది ఏం లేదు. ఎవరు లేనప్పుడు నడవాలని ప్రయత...