భారతదేశం, సెప్టెంబర్ 1 -- నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో రాసుకు పూసుకుని తిరిగే శాలిని వెనుక ఇంత కుట్ర చేస్తారా? బంధాల విలువ తెలియదా? శాలిని, క్రాంతిని ఎందుకు విడదీయాలని అనుకుంటున్నారు? అని కామాక్షి, శ్రుతిపై ఫైర్ అవుతుంది చంద్రకళ. ఈ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా అది నాదే అనుకుంటానని చంద్ర అంటుంది. మీ బుద్ధులు మంచివి కావు కాబట్టే మీకు ఇలా జరుగుతుందని చంద్ర మండిపడుతుంది.

శాలినికి, నాకు మధ్య డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు కానీ మేమిద్దరం ఈ ఇంటి కోడళ్లం. ఎప్పటికీ కలిసి ఉండేవాళ్లం. మీరు చేసిన పని గురించి శాలినికి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? అని చంద్రకళ అనగానే వద్దు చెప్పొద్దని కామాక్షి రిక్వెస్ట్ చేస్తుంది. శ్రుతిపై కోప్పడుతుంది. మళ్లీ ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నా వార్నింగ్ వేరే లెవల్ లో ఉంటుందని చంద్రకళ సీరియస్ గా అని ...