భారతదేశం, మే 7 -- నిన్ను కోరి సీరియల్ నేటి (మే 7) ఎపిసోడ్‍లో.. రఘురాంను చంపాలనుకున్నది శ్రీరాజ్, వరదరాజులే అనే నిజం విరాట్‍కు చెబుతానని చంద్ర అనుకుంటుంది. అలా చేస్తే విరాట్‍తో నీ పెళ్లి ఆగిపోతుందని చంద్రతో సుభద్ర అంటుంది. అయినా చెబుతానని, నిజం దాచి బావ, అత్తయ్యని మోసం చేయలేనని చంద్ర అంటుంది. ఒకరి ప్రాణం పోవాలా అని చంద్ర ప్రశ్నిస్తుంది. విరాట్‍కు చెప్పొద్దని శ్రీరాజ్ భార్య చంద్ర కాళ్ల మీద పడి అడుగుతుంది. కానీ అత్తయ్య వాళ్లకు నిజం చెప్పేస్తానని చంద్ర చెప్పేస్తుంది. ఇంతలో వరదరాజులు ఇంటికి విరాట్, జగదీశ్వరి, కామాక్షి వస్తారు.

వరదరాజులును కోపంగా పిలుస్తుంది జగదీశ్వరి. నీతి మాలిన నీచుడా.. బయటికి రారా అని అరుస్తూ అన్నయ్యపై ఉగ్రరూపం చూపిస్తుంది. ఇంతలో వరదరాజు, శ్రీరాజ్ అక్కడికి వస్తారు. నా భర్తకు ఎందుకు యాక్సిడెంట్ చేశారని వారిని జగదీశ్వరి ప్రశ్...