భారతదేశం, మే 6 -- నిన్ను కోరి సీరియల్ నేటి (మే 6) ఎపిసోడ్‍లో శ్రీరాజ్‌పై చంద్రకళ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రఘురాంను చంపాలనుకున్న అతడిపై ఫైర్ అవుతుంది. ఎందుకు నింద వేస్తున్నావని కుటుంబ సభ్యులు అంటే.. అది నింద కూడా నిజమని చంద్ర ఏడుస్తూ చెబుతుంది. శ్రీరాజ్ కూడా ఇది నిందే అనడంతో చంద్రకళ కోపం కట్టలు తెంచుకుంటుంది. శ్రీరాజ్‍ చెంపపై కొట్టేస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. వరదరాజులు తనపై చేయి ఎత్తితే అడ్డుకుంటుంది చంద్ర.

పెదనాన్న గొప్ప అని నమ్మి రెండు కుటుంబాలను కలపాలని చూస్తే చెడగొట్టాలని చూస్తున్నారని చంద్రకళ ఏడుస్తుంది. నన్ను పావులా వాడుకున్నారని బాధపడుతుంది. అదంతా అబద్ధం, ఎవరో నూరిపోశారని శ్రీరాజ్ అంటాడు. ఆ విషయం నీకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి చెప్పు అంటే.. పిచ్చా నీకు అని శ్రీరాజ్ అంటాడు. ఒట్టు వేయడు. నువ్వు తప్పు చేశావని చంద్ర అంటుంది. ...