భారతదేశం, మే 20 -- నిన్ను కోరి సీరియల్ నేటి (మే 20) ఎపిసోడ్‍లో.. నిద్ర లేచిన తర్వాత పడుకొని ఉన్న విరాట్‍ను ప్రేమగా తదేకంగా చూస్తుంది చంద్రకళ. ఇంతలో విరాట్ మేల్కొంటాడు. స్పృహలోకి వచ్చావా అని ఊరటగా ఉంటాడు విరాట్. నేను సోఫాలో కదా పడుకోవాలి.. మీరేంటి నా పక్కన ఉన్నారని చంద్రకళ అడుగుతుంది. ఇది కళా.. నిజమా అని అంటుంది. మీరు ఏదో దాస్తున్నారు బావా అని చంద్ర అంటుంది. ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్ చెప్పారని విరాట్ చెబుతాడు. కాఫీ ఒక్కటే తాగాను.. ఫుడ్ పాయిజన్ అవడం ఏంటి అని చంద్ర అంటుంది.

మీకు నా మీద ప్రేమ ఉంది, అందుకే జాగ్రత్తగా చూసుకున్నారని విరాట్‍తో చంద్ర అంటుంది. అమ్మ కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంది.. అంత మాత్రాన నీపై కోపం పోయినట్టా అని విరాట్ అంటాడు. అత్తయ్య కంగారు పడ్డారా అని చంద్ర సంతోషంగా అంటుంది.

పాయిజన్ ఇచ్చిన వ్యక్తి.. శాలినికి ఫోన్ చ...