భారతదేశం, మే 14 -- నిన్ను కోరి సీరియల్ నేటి మే 14వ తేదీన ఎపిసోడ్‍లో.. రాత్రి విరాట్ బెడ్‍రూమ్‍లోకి చంద్రకళ వస్తుంది. తలకు మల్లెపూలు పెట్టుకొని అందంగా రెడీ అయి ఉంటుంది. వెళ్లిపో అని విరాట్ అంటాడు. పెళ్లయ్యాక భర్త ఏ గదిలో ఉంటే.. భార్య అక్కడే ఉండాలని, నేను రూమ్ వదిలి వెళ్లను అని చంద్ర తేల్చిచెబుతుంది. ఇద్దరి మధ్య మాటలు సాగుతాయి. కోపంలో అమ్మాయిలు మాత్రమే అందంగా ఉంటారని ఎవరో చెప్పారని, అబ్బాయిలు కూడా కోపంలో కత్తిలా ఉంటారని చంద్ర అంటుంది. బయటికి వెళ్లు అని చిరాకు పడతాడు విరాట్.

సోఫాపై పడుకుంటా బయటికి వెళ్లను అని చంద్రకళ అంటుంది. సోఫాపై అలా వాలిపోయి అందంగా పడుకుంటుంది. విరాట్‍ను కవ్విచేందుకు ప్రయత్నిస్తుంది. చంద్రను విరాట్ తదేకంగా రొమాంటిక్‍గా చూస్తాడు. చంద్ర బుక్ చదువుతుంటే చూస్తూ ఉంటాడు విరాట్. చంద్ర చూడగాని చూపు తిప్పుకుంటాడు. కంగారు పడతాడు....