భారతదేశం, మే 13 -- నిన్ను కోరి సీరియల్ నేటి మే 13వ తేదీన ఎపిసోడ్‍లో.. కట్టుబట్టలతో ఇంటి నుంచి వచ్చా కదా.. కొత్త డ్రెస్‍లు కొనుకున్నానని చంద్రకళ చూపిస్తుంది. ఛీ అంటూ చిరాకు డపడతాడు విరాట్. దుస్తులు ఛీపే.. నీ భార్యగా సేవింగ్స్ మొదలుపెట్టేశానని చంద్ర అంటుంది. నువ్వు ఊ అను విరాట్.. దీన్ని.. అని కామాక్షి కోపంగా ఉంటుంది. ఏం చేస్తావ్ అంటూ మీదమీదకు వెళుతుంది చంద్రకళ.

విరాట్ బెడ్‍రూమ్‍లో తన దుస్తులు వస్తువులు సర్దుతుంది చంద్రకళ. రూమ్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదని అంటాడు. నా ఇష్టంతోనే మెడలతో తాళి కట్టారా అని చంద్ర అడుగుతుంది. శ్రీవారు, బావగారు, అయ్యగారు అంటూ కొంటెగా మాట్లాడుతుంది. గిల్లుతుంది. నన్ను బావ అనొద్దని విరాట్ అంటాడు. అప్పట్లో అలా పిలమనేవాడివి కదా అని చంద్ర అంటే.. అప్పుడు నీ మనస్తత్వం వేరు అని విరాట్ చెబుతాడు. దీంతో చంద్ర ఫీల్ అవుతుంది....