భారతదేశం, జూన్ 11 -- నిన్ను కోరి సీరియల్ నేటి (జూన్ 11) ఎపిసోడ్‍లో.. ఏవండోయ్ శ్రీవారు భోజనం చేసేందుకు రండి, మీకు ఇష్టమైనవే చేశానని విరాట్‍ను చంద్రకళ పిలుస్తుంది. వినపడలేదని విరాట్ అంటాడు. అయితే శ్యామల పిన్ని వచ్చి పిలుస్తుందని చంద్ర అంటుంది. దీంతో భయపడిన విరాట్.. వస్తున్నా అంటాడు. తాము కారం ఎక్కువగా కలిపిన కూర ఎక్కువ తింటే రచ్చరచ్చే అని 'దుష్టత్రయం' శాలినీ, కామాక్షి, శృతి అనుకుంటారు. వాళ్లకు చంద్ర కౌంటర్లు ఇస్తుంది.

మీ ఆయన పక్కన కూర్చో చంద్ర అని శ్యామల అంటుంది. మేం వడ్డిస్తామని కామాక్షి చెబుతుంది. ఒకరికొకరు తినిపించుకోండని విరాట్, చంద్రకళకు శ్యామల చెబుతుంది. మొన్న తినిపించుకున్నాం కదా అని విరాట్ అంటాడు. ఇప్పుడు సంప్రదాయం కోసం అని శ్యామల సర్దిచెబుతుంది. ఎగిలి ముద్ద తినిపించుకోవాలని అంటుంది. అలా మూడు ముద్దలు తినిపించుకోవాలని, కచ్చితంగా చేయ...