భారతదేశం, మే 22 -- నిన్ను కోరి సీరియల్ నేటి (మే 22) ఎపిసోడ్‍లో.. బిజినెస్ క్లిక్ అయిందని భూమి మీద కాళ్లు నిలబడడం లేదా అంటూ చంద్రకళతో శాలినీ అంటుంది. మీకు మండుతున్నట్టుంది అని చంద్ర పంచ్ వేస్తుంది. ఆ మంటకు నువ్వు కాలిపోతావని శాలినీ అంటే.. ఏమీ చేయలేవని చంద్ర వెటకరిస్తుంది. మీరంతా జుజుబీలు అని కామాక్షి, శృతి, శాలినీని అంటుంది. ఫోన్ ఎత్తలేదు.. మేం చాలా కంగారు పడుతున్నామని చంద్రకు వాళ్ల అమ్మ కాల్ చేసి అంటుంది. ఫోన్ కిందపడింది.. నాకు ఏం కాదని చంద్ర కవర్ చేస్తుంది.

ఇంటికి రాత్రి ఆలస్యంగా వస్తాడు విరాట్. ఇంత లేట్ ఎందుకైంది.. నీకోసం వెయిట్ చేస్తున్నా కదా అంటుంది. నీకెందుకు చెప్పాలి అని విరాట్ చిరాకు పడతాడు. భోజనం పెడతానని, నువ్వు తిన్నాకే తింటానని చంద్ర అంటుంది. నేనే వడ్డించుకుంటానని కోపంగా అంటాడు విరాట్. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తినేందుకు వి...